వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మంచి జోరుమీదన్న కెప్టెన్ బాబర్ ఆజాం(50)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 155 పరుగుల వద్ద బాబర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లు మొదట్లో ఆచి తూచి ఆడారు. అబ్దుల్లా షఫీక్(20) సిరాజ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చగా.. జోరుమీదున్న ఇమామ్ ఉల్ హక్‌ను హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం 73 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
MOHAMMED SIRAJ..... YOU BEAUTY!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
Cleans up Babar Azam for 50 - what a delivery by Siraj. pic.twitter.com/NgYHwZYQ3f
32 ఓవర్ల ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రిజ్వాన్ (48), సౌద్ షకీల్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Party is on at the Narendra Modi Stadium.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
- The best place to be at currently! ??pic.twitter.com/IisDdU3JB7