పాకిస్తాన్ నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. షాహీన్ ఆఫ్రిది వేసిన తొలి ఓవర్‌లోనే 10 పరుగులు రాగా.. హసన్ అలీ వేసిన రెండో ఓవర్ లో శుభ్‌మాన్ గిల్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో గిల్ (16) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగగా.. అక్కడినుండి ఆ బాధ్యతలు రోహిత్ శర్మ అందుకున్నాడు.
గిల్ ఔటయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్.. నలువైపులా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు. అతని ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి భారత్.. 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఈ క్రమంలో రోహిత్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో టీమిండియా స్కోర్.. 101/2.
రోహిత్ శర్మ(50), శ్రేయాస్ అయ్యర్(13) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 36 ఓవర్లలో 91 పరుగులు కావాలి.
Rohit Sharma nos has joint most fifty plus scores in World Cup run chases. pic.twitter.com/UPy0WYIKXj
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023
Anushka Sharma and Ritika Sajdeh appreciating Rohit Sharma's fifty. pic.twitter.com/YrSN8e2bC8
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2023