IND vs ENG: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఇంగ్లాండ్ బౌలర్లకు బజ్‌బాల్ రుచి చూపిస్తారా!

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత జట్టు శనివారం మొదటి సన్నాహక మ్యాచ్‌ ఆడుతోంది. గువాహటి వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌తో తలపతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హిట్‌మ్యాన్‌ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గువాహటి వాతావరణం చాలా వేడిగా ఉందన్న రోహిత్.. బౌలర్లు అలిసిపోతుం డా ఉండటంకోసమే బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు రిజర్వు బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారో.. ఊహించలేం.

జట్లు:

భారత్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. 

ఇంగ్లండ్ (బ్యాటింగ్ XI, ఫీల్డింగ్ XI): డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.