ఏప్రిల్ 10న రేలంపాడుపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ​స్టడీ

ఏప్రిల్ 10న  రేలంపాడుపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ​స్టడీ

హైదరాబాద్, వెలుగు: రేలంపాడు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్ ​నీటి లీకేజీలపై సెంట్రల్​ వాటర్ అండ్​పవర్ రీసెర్చ్ స్టేషన్​(సీడబ్ల్యూపీఆర్​ఎస్) స్టడీ చేయనుంది. ఈ నెల 10న రిజర్వాయర్​ను సీడబ్ల్యూపీఆర్ఎస్​అధికారులు సందర్శించనున్నారు. గూడెందొడ్డి గ్రామంలో రేలంపాడు రిజర్వాయర్​ను తొలుత 2.30 టీఎంసీలతో 2011లో నిర్మించారు. ఆ తర్వాత దానిని గత ప్రభుత్వం 4 టీఎంసీలకు పెంచింది. 

2019నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని నిల్వ చేశారు. ఆ తర్వాత రిజర్వాయర్ ​నుంచి నీరు లీకవడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు జియో ఫిజికల్, జియో టెక్నికల్​ టెస్టులను నిర్వహించారు. సీపేజీ నివారణకు కర్టెన్​ గ్రౌటింగ్​ చేయాలని సిఫార్సు చేశారు. అందుకు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే రిజర్వాయర్​పై సీడబ్ల్యూపీఆర్ఎస్​తో మరోసారి అధ్యయనం చేయించాలని ఇరిగేషన్​ శాఖ నిర్ణయించింది.