కూకట్ పల్లి ఐడియల్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. రేపటినుండి ( సెప్టెంబర్ 9) వినాయక నిమజ్జనాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం అవుతూ నిమజ్జనం వేడుకలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వినాయకులను తీసుకొని వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనంత త్వరగా నిమజ్జనాలను పూర్తి చేసి పంపించి వేసేలా ట్రాఫిక్ ఏర్పాట్లను చేయాలని ఆయన తెలిపారు.
అదేవిధంగా నిమజ్జనం పూర్తయ్యేవరకు ఐడియల్ చెరువు వద్ద ప్రత్యేక బృందాలతో పోలీసు పహారా ఏర్పాటు చేసి అనునిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాసరావు, బాలానగర్ ఏసిపి హనుమంతరావు తో పాటు జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు