సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశ సేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేసుకొని.. స్వేచ్ఛ కల్పించిన త్యాగధనులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ.. దేశానికి అంకితం కావడంలోనే ప్రతి మనిషికి సార్ధకత లభిస్తుందన్నారు. పోలీసు అధికారులు జాతి సమగ్రతకై, శాంతి సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలంతోనే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని ఆమె అన్నారు. మహానుభావుల త్యాగాలను నిరంతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ కవిత, సెక్షన్ల సిబ్బంది, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
For More News..