మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ పై సైబర్ అటాక్

హైదరాబాద్ లోని మహేష్ కోపరేటివ్ బ్యాంకుపై సైబర్ నేరగాళ్ల అటాక్ చేశారు. మహేష్ బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసి 12 కోట్ల రూపాయలు ట్రాన్సఫర్ చేసుకున్నారు హ్యాకర్లు. మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదుతో CCS పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి 120 అకౌంట్లో కి నగదు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. సర్వర్ ఎక్కడి నుంచి హ్యాక్ చేశారన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.