వివాదంలో ఎల్2: ఎంపురాన్.. సుప్రీం కోర్టులో ఫిర్యాదు.. మళ్ళీ రిలీజ్ చేస్తున్నారా.?

వివాదంలో ఎల్2: ఎంపురాన్..  సుప్రీం కోర్టులో ఫిర్యాదు.. మళ్ళీ రిలీజ్ చేస్తున్నారా.?

కోలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన మోస్ట్ ఏవైటెడ్ సీక్వెల్ ఎల్2: ఎంపురాన్ ఇటీవలే పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాని యాక్షన్ & పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంటున్నప్పటికీ కొందరు సోషలిస్టులు మాత్రం ఎల్2: ఎంపురాన్ లోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సైబర్ దాడికి దిగుతూ సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. 

దీంతో ప్రముఖ లాయర్  సుభాష్ ఈ విషయంపై సుప్రీం కోర్టుని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇందులోభాగంగా మోహన్ లాల్, ఎల్2: ఎంపురాన్ చిత్ర యూనిట్ పై సైబర్ అటాక్ కి దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ సైబర్ అటాక్ కి పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

అయితే ఎల్2: ఎంపురాన్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ఉండటంతో ఈ సన్నివేశాలని మళ్ళీ రీ ఎడిట్ చేస్తున్నారు. అలాగే విలన్ బాబా బజరంగీ పేరుని కూడా మార్చి ఈ రీ ఎడిట్ వెర్షన్ ని గురువారం (ఏప్రిల్ 3) రిలీజ్ చేస్తున్నారు. ఇకనైనా ఈ ఎల్2: ఎంపురాన్ కాంట్రవర్సీకి చెక్ పడుతుందో లేదో చూడాలి. 

►ALSO READ | రామ సేతు .. ‘ఒక యుద్ధం, ఒక ఆయుధం, ఒక కాపలాదారుడు’

ఈ విషయం ఇలా ఉండగా ఎల్2: ఎంపురాన్, గతంలో వచ్చిన లూసీఫర్ సినిమా హైప్ ని కంటిన్యూ భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ దాదాపుగా రూ.150 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే నార్త్ లో పలు చోట్ల ఈ సినిమాకి నెగిటివిటీ ఉండటంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మరి రీ ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ తర్వాత నార్త్ లో కలెక్షన్స్ పెరుగుతాయో లేదో చూడాలి.