వెటర్నరీ డాక్టర్ ను మోసగించిన సైబర్ చీటర్స్.. ఆర్మీ కుక్కలకు టీకాలు అంటూ స్కాం..

వెటర్నరీ డాక్టర్ ను మోసగించిన సైబర్ చీటర్స్.. ఆర్మీ కుక్కలకు టీకాలు అంటూ స్కాం..

సైబర్ చీటర్స్ మోసాలకు బలవుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. తాజాగా ఓ వెటర్నరీ డాక్టర్ సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యాడు. ఆర్మీ అధికారులమని.. ఆర్మీకి సంబంధించిన కుక్కలకు టీకాలు వేయాలంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. 90 కుక్కలకు టీకాలు వేయాల్సి ఉంటుందని.. మొదట 50శాతం చెల్లిస్తామని, టీకాలు వేసిన తర్వాత డబ్బులు ఇస్తామని వెటర్నరీ డాక్టర్ ను నమ్మించారు.

సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మిన వెటర్నరీ డాక్టర్ కేటుగాళ్లు చెప్పింది గుడ్డిగా ఫాలో అయ్యాడు. పేమెంట్ ప్రాసెస్ అప్రూవల్ కోసం రెండు పేమెంట్స్ చేయాలని సదరు డాక్టర్ ను నమ్మించారు స్కామర్లు. పేమెంట్ చేసిన ఐదు నిమిషాల్లో చెల్లించిన డబ్బుతో పాటు.. టీకాలకు సంబంధించిన పూర్తి డబ్బు పంపిస్తామని చెప్పిన కేటుగాళ్లు. దీంతో వాళ్ళ మాటలు నమ్మిన డాక్టర్ రూ. 1 లక్ష 70 వేలు పేమెంట్ చేశాడు.

Also Read:-భక్తుడి నుంచి స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లి చెట్టెక్కిన కోతి..

డబ్బులు అందుకున్న వెంటనే.. సదరు డాక్టర్ నంబర్ ను బ్లాక్ చేసేశారు స్కామర్లు. దీంతో మోసపోయానని గ్రహించిన డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు బాధితుడు.