లాటరీ పేరుతో మోసం

  • వృద్ధుడి నుంచి రూ.2.17 లక్షలు కాజేత

బషీర్ బాగ్, వెలుగు: కేరళ లాటరీ పేరిట సిటీకి చెందిన 67 ఏండ్ల వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. తొలుత బాధితుడిని ఇన్​స్టాలో సంప్రదించి, కేరళ లాటరీ లక్కీ డ్రాలో రూ.5 లక్షల గెలుపొందావని నమ్మించారు. వాటిని క్లెయిమ్ చేసుకోవాలంటే కొంత నగదు సెక్యూరిటీ కింద డిపాజిట్ చేయాలని సూచించారు. వాటిని తర్వాత తిరిగి చెల్లిస్తామన్నారు. అది నిజమని నమ్మిన బాధిత వృద్ధుడు స్కామర్స్ సూచించిన అకౌంట్లలో మూడు రోజుల్లో మొత్తం రూ 2,17,426 ను డిపాజిట్ చేశాడు. అనంతరం స్కామర్లు ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.