మహిళా వ్యాపారవేత్త నుంచి రూ.2.29 లక్షలు కాజేసిన సైబర్ ఛీటర్స్

మహిళా వ్యాపారవేత్త నుంచి  రూ.2.29 లక్షలు కాజేసిన సైబర్ ఛీటర్స్

బషీర్ బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు పేరిట నగరానికి చెందిన 53 ఏండ్ల మహిళా వ్యాపారవేత్తను సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ కథనం ప్రకారం... బాధిత మహిళకు సైబర్ చీటర్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అంటూ ఫోన్ చేశారు. క్రెడిట్ కార్డు అప్​డేట్​ చేసుకుంటే రూ. 5 లక్షల లిమిట్ ఇస్తామని నమ్మించారు. 

ప్రాసెస్ చేయడానికి ఆమె వాడుతున్న పాత క్రెడిట్ కార్డు వివరాలను, కార్డు ఫొటోతో పాటు ఓటీపీ వివరాలు సేకరించారు. కొద్దిసేపటికి బాధితురాలికి యూనియన్ బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్​ చేసి బిల్లు రూ. 2,29,180 వచ్చిందని చెప్పారు. ఆమె పేరు మీద వర్చువల్ క్రెడిట్ కార్డ్ జారీ అయిందని , నగదు డెబిట్ చేశారని వివరించారు. స్కామర్లు మోసాగించినట్లు గుర్తించిన బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.