ఎవర్రా మీరు.. కొత్త తరహాలో సైబర్​ ఛీటర్స్​ బెదిరింపులు.. ఎలాగంటే..

ఎవర్రా మీరు..  కొత్త తరహాలో సైబర్​ ఛీటర్స్​ బెదిరింపులు.. ఎలాగంటే..

జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుంది.  అందినకాడికి దోచుకొనేందుకు సైబర్​ ఛీటర్స్​ కొత్త తరహా దందా మొదలు పెట్టారు.  కరీంనగర్​ లో  సైబర్​ క్రిమినల్స్​ ఓ యువకుడిని బెదిరించారు.  సీబీఐ.. ఈడీ.. సుప్రీంకోర్టు పేరును ఉపయోగించి  కుట్రకు ప్లాన్​ చేశారు.  అంతేకాదు.. ఏకంగా ఎన్​ కౌంటర్​ స్పెషలిస్ట్​ దయానాయక్​ పేరును కూడా వాడారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

కరీంనగర్​ కు చెందిన చిలువేరు శ్రీకాంత్​ అనే వ్యక్తికి ఈ రోజు ( ఏప్రిల్​ 20) మధ్యాహ్నం  గుర్తు తెలియని వ్యక్తులనుంచి వీడియో కాల్​ వచ్చింది. నీవు మనీలాండరింగ్​కు పాల్పడ్డావని .. మేము చెప్పినట్లు వినకపోతే అరెస్ట్​ చేయాల్సి ఉంటుందని  శ్రీకాంత్​ కు తెలిపారు. శ్రీకాంత్​ కరీంనగర్​లో సింగర్​ గా... ప్రైవేట్​ ఈవెంట్​ ఆర్గనైజర్​ గా కొనసాగుతున్నాడు.  

సైబర్​ ఛీటర్స్​   శ్రీకాంత్ ఆధార్ కార్డు నెంబర్ తో సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ లేఖలు పంపించారు.  దీనితో పాటు మహారాష్ట్ర పోలీస్​ అధికారి  ఎన్​ కౌంటర్​ స్పెషలిస్ట్​  దయానాయక్ పేరుతో ఓ లెటర్ కు కూడా పంపారు.  తరువాత రెండు గంటలపాటు తరచూ వీడియో కాల్స్​ చేస్తూ... చివరకు డబ్బులు ఇస్తే వదిలేస్తామని ఛీటర్స్​ అన్నారని తెలిపాడు. తన వివరాలు మిస్ యూజ్​ అయ్యాయనుకున్న సైబర్​ ఛీటర్స్​ బాధితుడు శ్రీకాంత్​...  సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. సైబర్ అరెస్టు పేరుతో బెదిరించి లక్షలు కాజేయాలని ప్లాన్ వేసిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు శ్రీకాంత్.

మరిన్ని వార్తలు