- పార్ట్ టైమ్జాబ్పేరుతో రూ.31.60 లక్షలు మోసపోయిన మహిళ
- హైదరాబాద్‌కు చెందిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
గోదావరిఖని/ మంచిర్యాల వెలుగు : సైబర్‌నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లను ఇచ్చిన ఒకరిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సైబర్క్రైమ్పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆన్లైన్లో పార్ట్ టైమ్జాబ్పేరుతో సైబర్‌నేరగాళ్లు మంచిర్యాల జిల్లాకు చెందిన మహిళ నుంచి రూ.31.60 లక్షలు దోచేశారు.
బాధిత మహిళ గత అక్టోబర్10న రామగుండం కమిషనరేట్సైబర్ క్రైమ్స్టేషన్లో కంప్లయింట్ చేసింది. సైబర్ క్రైమ్ఏసీపీ ఎం.వెంకటరమణ, ఇన్ స్పెక్టర్ జె.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. హైదరాబాద్ డబీర్‌పురాకు చెందిన ఏసీ టెక్నీషియన్, జొమాటో డెలీవరీ బాయ్ ఎండీ ఆవాద్ బ్యాంకు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మూడు బ్యాంక్ అకౌంట్లను ఓపెన్‌చేసి ఇలియాస్అనే వ్యక్తికి అప్పగించినట్టు, అతను సైబర్‌నేరగాళ్లకు అందజేసినట్టు తెలిపాడు. లక్షకు రూ.300 కమీషన్ఇస్తున్నట్టు ఆవాద్ఒప్పుకున్నాడని, మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ వెంకటరమణ తెలిపారు.