Cyber Crime : క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట కుచ్చుటోపి

క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరిట ఓ న్యాయవాదికి సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసం ఉండే వెంకటరత్నం అనే లాయర్ కు SBI బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని.. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ చేయాలంటూ సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డు వివరాలు తెలపాలని వెంకటరత్నం మొబైల్ నెంబర్ కు ఓటీపీ పంపించారు సైబర్ నేరగాళ్లు. దీంతో తిరిగి ఓటీపీని అవతలి వ్యక్తికి పంపించాడు బాధితుడు వెంకటరత్నం.

వెంటనే వెంకటరత్నం బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.33 వేల 500 వేలు డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కామారెడ్డి పట్టణ పోలీసులు.