- నిజామాబాద్ జిల్లా యువకుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు
ధర్పల్లి, వెలుగు: ఫ్రెండ్‌కు హెల్త్ బాగోలేదని ఫోన్ చేసి రూ.1.63 లక్షలను సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆల స్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల1న మధ్యాహ్నం 3 గం టల సమయంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన అమ్రాద్ ప్రశాంత్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
అతని ఫ్రెండ్రవి లెక్కనే మాట్లాడి, ఆస్పత్రిలో ఉన్నానని అర్జెంట్ గా రూ. 2 లక్షలు పంపమని కోరాడు. నిజమేనని నమ్మిన ప్రశాంత్ వెంటనే బ్యాంకుకు వెళ్లి తన వద్ద ఉన్న రూ. 1.63 లక్షలు పంపాడు. అనంతరం ఫ్రెండ్ రవికి ఫోన్ చేసి హెల్త్ ఎలా ఉందని, అమౌంట్ పంపానని చూసుకోమని తెలిపాడు.
ఆరోగ్యం బాగానే ఉందని, డబ్బులు అడగలేదని, అకౌంట్‌కు రాలేదని అతడు చెప్పడంతో ప్రశాంత్ అవాక్కైయ్యాడు. సైబర్ నేరగాళ్లు మోసగించినట్టు తెలుసుకుని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.