కోరుట్ల, వెలుగు: ఓ వ్యక్తి వాట్సాప్‌కి బ్యాంక్ అకౌంట్ఆధార్అప్డేట్ అంటూ మేసేజ్ రాగా దానిపై క్లిక్చేయడంతో అకౌంట్‌లోంచి రూ.1,13,804 మాయమయ్యాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోనిదుంపేటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ అప్డేట్ ఏపీకే ఫైల్అనే మెసేజ్ వచ్చింది. ఆ ఫైల్‌పై క్లిక్ చేయగా అతడి అకౌంట్ నుంచి మూడు రోజుల్లో 20 దఫాలుగా మొత్తం రూ.1,13,804- మాయమయ్యాయి. ఇవి గుర్తు తెలియని వ్యక్తి ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. బాధితుడు కథలాపూర్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.
ఉద్యోగి ఖాతా నుంచి 40 వేలు లూటీ
జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ర్యాగల్ల శివప్రసాద్ సైబర్ మోసానికి గురయ్యాడు. వాట్సాప్ లో వచ్చిన ఓ లింక్ బ్యాంక్ నుండి వచ్చిందనుకుని పొరబడి ఓపెన్ చేసి ఏటీఎం డిటెయిల్స్ఎంటర్చేశాడు. తర్వాత అరగంటకి శివప్రసాద్ అకౌంట్నుంచి విడతలవారీగా ఐదు సార్లు 5వేలు, 15వేలు కట్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ పేరుతో పారికి టోకరా
నిర్మల్ : రాజస్థాన్ కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను బుధవారం ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా చోర్ భాసియాకు చెందిన షేక్ నసీం ఖాన్, తస్లీమ్ ఖాన్ , సలీం ఖాన్ ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలు చేస్తున్నారు. ఈ నెల 24న ముగ్గురు కుంటాలలోని బస్టాండ్ వద్ద ఉన్న అభిలాష ఏటీఎం సర్వీస్ సెంటర్ వచ్చారు. తమకు రూ.50 వేలు అవసరముందని, డబ్బును ఆన్‌లైన్‌ద్వారా పంపిస్తామని, తమకు క్యాష్ఇవ్వాలని కోరారు.
తన దగ్గర అంత డబ్బు లేదని కొద్దిసేపు ఆగమంటూ ఆ సర్వీస్ సెంటర్ యజమాని వారికి చెప్పాడు. ఆ టైంలో ఏటీఎం సర్వీస్ సెంటర్ కు స్థానికంగా బట్టల వ్యాపారం చేసే జుట్టు గంగాధర్ వచ్చాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులను తన అకౌంట్లో వేయాలని కోరాడు. దీనిని గమనించిన షేక్ నసీం తాను అంబకంటి గ్రామానికి చెందిన వాడినని తనకు రూ. 50 వేలు అవసరం ఉందని, ఆ డబ్బును తాను ఆన్ లైన్ ట్రాన్స్ఫర్చేస్తానని నమ్మించాడు. గంగాధర్ అతడికి రూ.50వేలు ఇవ్వగానే బోగస్ అకౌంట్ నుంచి గంగాధర్ అకౌంట్లో కి రూ.50 వేలు పంపినట్లు చూపాడు.
నమ్మిన బాధితుడు గంగాధర్ గత నెల 27న బ్యాంకుకు వెళ్లి రూ.50 వేలు విత్ డ్రా చేయాలని చూడగా డబ్బులు లేవని తెలిసింది. దీంతో తాను మోసపోయినని గ్రహించి కుంటాల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి ముగ్గురు ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి సెల్ ఫోన్లు..పదికి పైగా ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా చేధించిన భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్నైలు, కుంటాల ఎస్సై రజినీకాంత్ తో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.