విగ్గు పెట్టి.. డబ్బున్నోడిగా బిల్డప్.. 50 మందితో పెళ్లి.. గచ్చిబౌలి నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి..

విగ్గు పెట్టి.. డబ్బున్నోడిగా బిల్డప్.. 50 మందితో పెళ్లి.. గచ్చిబౌలి నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి..

హైదరాబాద్: పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసుకుని సంబంధం కుదుర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మ్యాట్రిమొనీ సైట్లు పెళ్లిళ్లు కుదిర్చి కమీషన్లు దండుకునే రోజులొచ్చేశాయి. అంతా సవ్యంగా ఉండి.. మ్యాట్రిమొనీల్లో కుదుర్చుకున్న సంబంధం సక్సెస్ అయితే కథ సుఖాంతం అవుతుంది. అలా కాకుండా.. మోసగాళ్ల బారిన పడితే లబోదిబోమనాల్సిందే.

ఎందుకంటే.. కొందరు ఈజీ మనీ కోసం మ్యాట్రిమొనీ సైట్లను అడ్డాగా మార్చకుంటున్నారు. అలాంటి కేటుగాడే ఈ వంశీకృష్ణ. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉండే వంశీకృష్ణ తనను తాను ధనవంతుడిగా మ్యాట్రిమొనీ సైట్స్లో పరిచయం చేసుకుంటాడు. నెత్తి మీద సరిగ్గా జుట్టే లేకపోయినప్పటికీ విగ్గులు పెట్టుకుని, లుక్ మార్చుతూ ఫొటోలు అప్లోడ్ చేస్తాడు. మ్యాట్రిమొనీలో వరుడి కోసం వెతుకుతున్న అమ్మాయిలకు, అమ్మాయి తల్లిదండ్రులకు అందగాడు, డబ్బునోడు అనే ఫీల్ క్రియేట్ చేస్తాడు. 

ALSO READ | ‘బానే ఎక్స్ ట్రాలు’ చేశాడు.. జైల్లో వేశారు.. ఫేమస్ అవ్వడానికి గిసుంటి కథలు పడితే చివరికి ఇట్లనే అయితది..!

మ్యాట్రిమొనీ డాట్‌కామ్‌లో అందమైన ఫొటోలు పెట్టి ‘కోట్ల ఆస్తి ఉన్న తనకు వధువు కావలెను’ అని వంశీకృష్ణ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. నమ్మి అతని వలలో పడిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని, లక్షల కట్నం దండుకుని కొన్నాళ్లకు ముఖం చాటేస్తాడు. మరో గెటప్ తో మళ్లీ ప్రొఫైల్ అప్ లోడ్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే.. వంశీకృష్ణ దందా ఇది. ఇలా విగ్‌లు పెట్టుకుని, వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణ దాదాపు 50 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు.

ఒక లేడీ డాక్టర్ను కూడా ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేయగా.. ఇతని మోసాన్ని గ్రహించిన ఆ డాక్టర్ తండ్రి ధైర్యం చేసి సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఇతగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి నిత్య పెళ్లిళ్ల కేసుల్లోనే ఇప్పటికే పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లివచ్చినా వంశీకృష్ణ బుద్ధి మాత్రం మారలేదు.