కాలర్ ట్యూన్‌తో సైబర్ నేరాలు ఆగవు..: కేటీఆర్

కాలర్ ట్యూన్‌తో సైబర్ నేరాలు ఆగవు..: కేటీఆర్
  • కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి

హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలను ఓ కాలర్ ట్యూన్ పెట్టి ఆపలేమని, ఈ విషయాన్ని కేంద్రం గుర్తించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఆన్​లైన్ గ్యాంబ్లింగ్​తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని ఆపడం ప్రభుత్వాలకు సవాల్​గా మారిందని పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం నిర్వహించిన ‘ఎంట్రప్రెన్యూర్ టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2025’లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, ఎక్స్​టెండెడ్ రియాలిటీ వంటి సాంకేతికతలు ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తాయన్నారు.