Hi.. ఎలా ఉన్నావు!..యువతులు... మహిళలే టార్గెట్ గా వాట్సప్ కాల్స్

Hi.. ఎలా ఉన్నావు!..యువతులు... మహిళలే టార్గెట్ గా వాట్సప్ కాల్స్
  • సైబర్ నేరగాళ్ల  నుంచి పోలీసుల ఫొటోలతోనూ బెదిరింపు కాల్స్  
  • వాట్సప్ డీపీ ఫొటోస్‌‌‌‌‌‌‌‌ కాపీ చేసుకుని ఆకతాయిల ఆగడాలు
  • ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీ మేల్ వాయిస్‌‌‌‌‌‌‌‌ లతోనూ వేధింపులు
  • ఈ ఏడాది గ్రేటర్ పరిధిలో 32 ఫిర్యాదులు

హైదరాబాద్,వెలుగు : సోషల్ మీడియా అడ్డాగా సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు, పోకిరీ లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, ఎక్స్‌‌‌‌‌‌‌‌(ట్విట్టర్),స్కైప్ లాంటి సోషల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌లో మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలు, ఫేక్‌‌‌‌‌‌‌‌ డీపీలతో మోసాలకు పాల్పడుతున్నారు. ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళల పేర్లు, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ డీపీలో యువతుల ఫొటోలు కనిపిస్తే చాలు మెసేజ్‌‌‌‌‌‌‌‌లు చేస్తూ వేధిస్తున్నారు. ఆపై ఫేక్ ప్రొఫైల్ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసి ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో  బాధితులు పోలీసుల అనుమానితుల రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారు.

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ సిటీలో ఈ ఏడాది 32 కేసులు నమోదయ్యాయి.  ముందుగా తమకు తోచిన నంబర్లను సేవ్ చేసుకుంటున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలోని అమ్మాయిల ఫొటోలను వాట్సప్ డీపీలుగా పెట్టుకుంటున్నారు.  వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైల్ డీపీలో తెలియని యువతు లు, అమ్మాయిల ఫొటోలు కనిపిస్తే చాలు చాట్ చేస్తున్నారు. టార్గెట్ చేసిన నంబర్ కి వాట్సప్ వాయిస్ కాల్ చేసి.. అవతల మహిళలైతే ట్రాప్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ప్రశ్నిస్తే.. బంధువుననో  లేక ‘‘సారీ మేడమ్ నంబర్ రాంగ్ డయల్’’ అనో చెప్పి తప్పుకుంటున్నారు. 

ఫొటోలు తీసి డీపీలుగా పెట్టుకుని.. 

కొందరు పోకిరీలు మహిళలు, యువతుల పాలిట శాపంగా మారుతున్నారు. బస్టాప్‌‌‌‌‌‌‌‌లు, కాలేజీలు,కార్పొరేట్ కంపెనీల్లోని ఆకతాయిల సోషల్ యాప్స్‌‌‌‌‌‌‌‌తో వేధిస్తున్నారు. ఫొటోలు, వీడియో క్లిప్స్ దొంగచాటుగా తీస్తున్నారు. వాటిని వాట్సాప్ ద్వారా ఇతరులకు పోస్ట్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత అదే నంబర్ కు ‘‘ హాయ్’’ అని వాట్సాప్ మెసేజ్ పోస్ట్ చేస్తున్నారు.

స్పందించిన వాళ్లతో చాటింగ్ చేస్తుంటారు. ఇలా కొందరు ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తుంటే, మరికొందరు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. మాట వినని యువతులకు వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు.

ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్లు కనిపిస్తే..

సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఫొటోలు, ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళల పేర్లు కనిపిస్తే చాలు ట్రాప్‌‌‌‌‌‌‌‌ స్కెచ్ వేస్తున్నారు. వాట్సాప్ డీపీని కాపీ చేసుకుని మార్ఫింగ్ చేస్తున్నారు. అలా చేసిన ఫొటోలను బాధితులకు పోస్ట్ చేస్తున్నారు. తాము చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు. లేకపోతే మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలను సోషల్ మీడియా, కాల్‌‌‌‌‌‌‌‌గర్ల్స్  వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తామని బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌ కు పాల్పడుతున్నారు. ఇలా ఉద్యోగస్తులు, ఐటీ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ నే ఎక్కువగా టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

ట్రూ కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫీ మేల్ పేరుతో డిస్ ప్లే కనిపిస్తే చాలు ఆ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేవ్ చేసుకుంటున్నారు. అప్పటికే ఫేక్ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌తో ఉన్న డీపీ వాట్సాప్‌‌‌‌‌‌‌‌ కాల్స్, మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపిస్తున్నారు. ఎవరైనా తమ ట్రాప్‌‌‌‌‌‌‌‌లో చిక్కితే టై పాస్ కోసం దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య షీ టీమ్‌‌‌‌‌‌‌‌ పోలీసుల వద్ద పెరిగిపోతోంది. 

‘‘ ఓ మహిళ నంబర్ కి వాట్సప్ లో ‘హాయ్ ఎలా ఉన్నావు’ అనే మెసేజ్ వచ్చింది. అది ఎవరో తెలియక ఆమె తన భర్తకు చూపింది. ఆ నంబర్ ఎవరి దో తెలుసుకునేందుకు కాల్ చేశాడు. అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మళ్లీ ఆమె నంబర్ కి అశ్లీల వీడియో కాల్ వచ్చింది. అది చూసిన దంపతులకు వాట్సప్ కాల్ అంటేనే భయం పుట్టేలా చేసింది.’’

‘‘ వరంగల్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల్లో ఫేక్‌‌‌‌‌‌‌‌ వాట్సాప్ డీపీలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.  పోలీస్ యూనిఫామ్‌‌‌‌‌‌‌‌  ఫొటోస్‌‌‌‌‌‌‌‌ డీపీలతో సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫారెన్ లో ఉండే కుటుంబ సభ్యుల ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌కి కూడా కాల్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసుల్లో అరెస్ట్ చేశామని బెదిరిస్తున్నారు. అందినంతా దోచేస్తున్నారు.’’  

పోస్ట్ చేసేటప్పుడు  జాగ్రత్తలు మస్ట్

 వాట్సాప్‌‌‌‌‌‌‌‌ డీపీలకు సెక్యూరిటీ ఫీచర్స్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. ఫొటోలను ఇతరులు కాపీ చేసుకోకుండా సెట్టింగ్స్ చేసుకోవాలి. దీంతో ఫొటో స్క్రీన్ షాట్స్‌‌‌‌‌‌‌‌ కూడా తీసుకోవడానికి వీలుకాదు. ఇలాంటి జాగ్రత్తలతో డీపీలు  దుర్వినియోగ మేయ్యే చాన్స్ తక్కువ. తెలిసిన వారే ఇలాంటి మోసాలకు, బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌కు పాల్పడుతుంటారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.’’

 – శివమారుతి, ఏసీపీ,సైబర్ క్రైమ్,హైదరాబాద్‌‌‌‌‌‌‌‌