
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు ఇన్ని రోజులు సామాన్యులకే భద్రత లేకుండా చేసిన ఈ కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీస్ యాప్స్ ను హ్యాక్ చేశారు. తాజాగా TSCOP యాప్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు, ఈ యాప్ లో డిపార్ట్మెంట్ కు సంబంధించిన వివరాలున్నాయి. యాప్ ను హ్యాక్ చేసిన కేటుగాళ్లు అందులో ఉన్న డేటాను ఆన్లైన్లో అమ్ముతున్నారు. దాదాపుగా ఇందులో 12 లక్షల మంది డాటా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.