బీమా కార్డు యాక్టివేట్ పేరిట 1.47 లక్షలు కొట్టేశారు

బీమా కార్డు యాక్టివేట్ పేరిట 1.47 లక్షలు కొట్టేశారు
  • ఆర్టీసీ ఉద్యోగిని మోసగించిన సైబర్ నేరగాళ్లు  

ఘట్ కేసర్, వెలుగు : ఆర్టీసీ అధికారిని నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు.  పోచారం ఐటీసీ సీఐ రాజువర్మ తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పరిధి అరుంధతి కాలనీకి చెందిన ధరావత్ వెంకట్రావు(52) టీఎస్ఆర్టీసీలో డిప్యూటీ సూపరింటెండెంట్. గత నెల 31న ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డు డిపార్టుమెంట్ నుంచి కాల్ చేస్తున్నామని, క్రెడిట్ కార్డు బీమా కార్డు యాక్టివేట్ అయ్యిందని సైబర్ నేరగాళ్లు తెలిపారు.

ఎలాంటి క్రెడిట్ కార్డుకు బీమా చేయలేద ని వెంకట్రావు చెప్పాడు. బీమా కార్డు వెంటనే డియాక్టివేట్ చేయమని అతను చెప్పగా..  సైబర్ నేరగాళ్లు వాట్సప్ లింక్ పంపి.. వివరాలను నమోదు చేయాలని సూచించా రు. నమోదు చేసి, ఓటీపీ నంబర్ కూడా చెప్పడంతో వెంకట్రావు బ్యాంక్ అకౌంట్ లోని రూ.1.47 లక్షలు ట్రాన్స్ ఫర్ అయ్యా రు. బ్యాంక్ మెసేజ్ చూసుకుని మోసపోయాయని1980 సమాచారం అందించి, పోచారం ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.