బషీర్ బాగ్, వెలుగు : పార్ట్‌టైమ్ జాబ్, ఇన్వెస్ట్ మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. పార్ట్ టైమ్ జాబ్ అంటూ టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యాపారికి మెసేజ్ వచ్చింది. నిజమని నమ్మి సైబర్ క్రిమినల్స్ చెప్పినట్లుగా బాధితుడు కొన్ని టాస్క్ లను పూర్తి చేశాడు.
అనంతరం పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. రూ.10,000 పెట్టించి, రూ.16,500 లాభం వచ్చిందని నమ్మించారు. ఇలా బాధితుడి నుంచి విడతల వారీగా మొత్తం రూ.6,72,000 లాగేశారు. తిరిగి డబ్బు రాకపోవడంతో మోసపోయిన బాధితుడు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశామని ఏసీపీ శివమారుతి తెలిపారు.