హెల్త్ ఆఫీసర్​కు సైబర్​ క్రిమినల్స్​ టోకరా.. రూ.5.77లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హెల్త్ ఆఫీసర్​కు సైబర్​ క్రిమినల్స్​ టోకరా.. రూ.5.77లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కు చెందిన ఓ హెల్త్ ఆఫీసర్ వద్ద సైబర్ నేరగాళ్లు రూ.5.77లక్షలు కొట్టేశారు. 30 ఏండ్ల మహిళ హైదరాబాద్​లో హెల్త్ ఆఫీసర్ గా పని చేస్తోంది. ఆమె బినాన్స్ అనే బిట్​కాయిన్, క్రిప్టో కరెన్సీయాప్ లో పెట్టుబడి పెట్టింది. కొద్ది రోజుల క్రితం బినాన్స్​యాప్​పేరిట సైబర్ నేరగాళ్లు మహిళకు కాల్ చేశారు. డబ్బును అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తామని నమ్మబలికారు. తాము చెప్పినట్టుగా చేయాలని సూచించి..మహిళ నుంచి డబ్బులను వారి అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​అయ్యేలా చేసుకున్నారు. 

కాల్ కట్ అవ్వగానే మూడు సార్లు సుమారు రూ. 5.77 లక్షలు అకౌంట్ ట్రాన్స్ ఫర్ అయినట్లు హెల్త్ ఆఫీసర్  గుర్తించింది. వెంటనే బినాన్స్ వ్యాలెట్ చెక్ చేయగా బ్యాలెన్స్ జీరో చూపించింది. 5,993 యూఎస్ డీటీ (రూ.5.77లక్షలు) గుర్తుతెలియని వ్యాలెట్ కు బదిలీ అయ్యాయని ఈమెయిల్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు.. ఆన్ లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోర్టల్ కు  ఫిర్యాదు చేసింది.