
- సిద్దిపేటలో ఒకే రోజు రూ.3.64 లక్షలు లూటీ
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో గురువారం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ఏడుగురి నుంచి రూ.3.64 లక్షలు కాజేశారని సీపీ ఎన్.శ్వేత తెలిపారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే నేషనల్సైబర్సెల్హెల్ప్లైన్కు కాల్ చేయగా సైబర్నేరగాళ్లఅకౌంట్లు ఫ్రీజ్‌చేశారు. వివిధ కేసుల వివరాలిలా ఉన్నాయి..
ఓటీపీ చెప్పలే...లింక్ ఓపెన్ చేయలే..అయినా..
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడి అకౌంట్ నుంచి అతడి ప్రమేయం లేకుండా, ఓటీపీ చెప్పకుండా, లింకు ఓపెన్ చేయకుండా రూ.49,999 కొట్టేశారు. డబ్బులు కట్ అయిన విషయం తెలుసుకున్న బాధితుడు నేషనల్ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నంబర్1930 కాల్ చేయడంతో వారు స్పందించి సైబర్‌క్రిమినల్ అకౌంట్లోని రూ.46,999 - ఫ్రీజ్‌చేశారు.
జాబ్ లకోసమై వలలో పడ్డారు..
సిద్దిపేట వన్టౌన్పీఎస్పరిధిలోనే మరో బాధితుడు టెలిగ్రామ్ యాప్ లో పార్ట్ టైం జాబ్ ఉందని చూశాడు. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్చేశాడు. వాళ్లు చెప్పినట్టు వెబ్సైట్లో కుబేర్ ఫుడ్ ఐటమ్ కొన్నాడు. తర్వాత టాస్కులు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పగానే నమ్మి రూ.64,132- పంపించాడు. తర్వాత వాళ్లు పంపిన లింక్ఓపెన్ చేయగా బ్లాంక్‌గా వచ్చింది. దీంతో సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయగా వారు సైబర్ క్రిమినల్అకౌంట్ లోని రూ.11,000 ఫ్రీజ్‌చేశారు. ఇదే పీఎస్పరిధిలోని మరో బాధితుడి ఫోన్‌కు ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ ఉందని ఓ లింక్ పంపించారు. దాన్ని క్లిక్ చేయగా టెలిగ్రామ్ ఓపెన్అయ్యింది. అందులో రిజిస్టర్ చేసుకోమని చెప్పగానే చేసుకున్నాడు. టాస్క్ బెస్ట్ ప్రొడక్ట్‌లో చిన్నగా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని సైబర్ క్రిమినల్చెప్పగానే ఆశపడి గూగుల్ పే ద్వారా రూ.29,000 పంపించాడు. తర్వాత లింక్ ఓపెన్ చేయగా బ్లాక్ చేసి ఉండడంతో హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేశాడు. దీంతో సైబర్ నేరగాడి అకౌంట్ లోని రూ.2వేలు ఫ్రీజ్‌చేశారు.
తక్కువ టైంలో ఎక్కువ పైసలొస్తాయని..
గజ్వేల్ కు చెందిన బాధితుడు నబీర్మెన్ ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెడితే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడ్డాడు. సైబర్ క్రిమినల్పంపిన ఫోన్ నంబర్‌కు గూగుల్ పే ద్వారా రూ.90 వేలు పంపించాడు. తర్వాత వెబ్సైట్ఓపెన్ చేయగా బ్లాక్ చేసి ఉంది. మోసపోయానని తెలుసుకుని1930 కి కాల్ చేసి చెప్పాడు. దీంతో మోసగాడి అకౌంట్లోని రూ.16వేలు ఫ్రీజ్‌చేశారు.
పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని..
సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు ఆన్లైన్ లో ఓ యాప్చూసి రూ. వెయ్యి పెట్టుబడి పెట్టాడు. వారు రూ.2 వేలు ఇచ్చారు. ఇలా మూడు, నాలుగు వేలు పెట్టగా దానికి అమౌంట్ఇచ్చారు. దీంతో ఇంకా ఎక్కువ పెడితే మరింత ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఒకేసారి రూ.25 వేలు పెట్టాడు. డబ్బులు రిటర్న్రాకపోగా లింక్ బ్లాక్ చేశారు. దీంతో సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేశాడు. వన్ టౌన్ పీఎస్పరిధిలోనే మరో బాధితుడి వాట్సాప్నంబర్కు ఓ లింక్రాగా ఓపెన్ చేశాడు. అందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఉండడంతో రూ.15 వేలు పెట్టాడు. అయితే, ఇతడి అకౌంట్ లోకి డబ్బులు వచ్చినా డబ్బులు విత్ డ్రా కాకుండా బ్లాక్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
ఓటీపీ, సీవీవీ చెప్పి..
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ బాధితురాలికి సైబర్ నేరగాడు ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పాడు. వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డ్ చార్జీలు రూ.2,500 కట్ చేయకుండా చేస్తానని, ఇప్పటివరకు కట్ చేసిన అమౌంట్ ను రిఫండ్ చేస్తానని చెప్పాడు. ఇది నమ్మిన బాధితురాలు తన క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ, సీవీవీ నంబర్చెప్పింది. దీంతో బాధితురాలి క్రెడిట్కార్డులోని రూ. 90,994 కట్ అయ్యాయి. వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్చేసి ఫిర్యాదు చేసింది.