ఐపీఎల్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్ కు పండగ. పైగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటే ఇంకా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ 5న సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్ కు వస్తారు క్రికెట్ ఫ్యాన్స్. ఇప్పటికే టికెట్లు ఓ రేంజ్ లో అ అమ్ముడుపోయాయి. ఆన్ లైన్ లో టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. దీంతో అమ్మకాలు నిలిపివేసింది పేటీఎం.
అయితే ఇదే అదునుగా కొందరు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ లో టికెట్స్ అమ్ముతామంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తు డబ్బులు దండుకుంటున్నారు.క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు కొందరు ముఠా సభ్యులు. టికెట్స్ పై డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు. ఈ ఘటనపై కొన్ని ఫిర్యాదులు రావడంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. క్రికెట్ అభిమానులు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ఆన్ లైన్లో ఎవరికి డబ్బులు పంపించకూడదని హెచ్చరిస్తున్నారు.