ఎల్ఐసి పాలసీ పేరిట ఫోన్ కాల్.. అకౌంట్ నుండి 60వేలు మాయం

ఎల్ఐసి పాలసీ పేరిట ఫోన్ కాల్.. అకౌంట్ నుండి 60వేలు మాయం

అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మకండి, తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోకండి.. అని పోలీసులు, ప్రభుత్వాధికారులు ఎంత మొరపెట్టుకున్నా మోసపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా, జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి.. సైబర్ మోసగాడి మాయమాటలు నమ్మి రూ.60వేలు పోగొట్టుకున్నాడు. 

Also Read :- 2 గంటల నుంచి గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు

కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ఎల్ఐసి పాలసీపై బోనస్ వచ్చిందని ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. ఆ బోనస్ మొత్తం ఖాతాలో జమ అవ్వాలంటే.. తాను చెప్పినట్లు చేయాలని సూచించాడు. నిజమని నమ్మిన బాధితుడు అతను చెప్పినట్లుగానే అన్నీ చేశాడు. క్షణాల్లో అతని ఖాతాలోని రూ.60వేలు మాయమయ్యాయి. ఫోన్ కాల్ ముగిసిన అనంతరం అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లుగా వచ్చిన మెసేజ్ చూసి బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.