‘శూన్య’ లింక్​తో రూ.4.31 కోట్ల చీటింగ్

‘శూన్య’ లింక్​తో రూ.4.31 కోట్ల చీటింగ్

హైదరాబాద్, వెలుగు: స్టాక్స్​లో ఇన్వెస్ట్​మెంట్​పేరుతో సైబర్ సైబర్​ నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ ని చీట్​ చేసి, రూ.4.31కోట్లు కొల్లగొట్టారు. నెల రోజుల వ్యవధిలో ఇంత మొత్తాన్ని కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 11 మందిపై కేసు నమోదు చేశారు. సిటీలోని యాప్రాల్​ప్రాంతానికి చెందిన రాజేశ్వరరావుకు గత నెలలో ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఓ లింక్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. దాన్ని క్లిక్​చేయడంతో అతని ఫోన్​ నంబర్​ ఓ వాట్సాప్​ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో యాడ్ ​అయింది. అందులోని దివ్యాంశి అగర్వాల్ ​అనే మెంబర్​ ఫిన్‌‌‌‌‌‌‌‌వసియా ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని రాజేశ్వరరావును రిక్వెస్ట్​చేసింది. 

‘శూన్య’ అనే యాప్​లింక్​సెండ్​చేసింది. నిజమేనని నమ్మిన రాజేశ్వరరావు శూన్యా యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుని పెట్టుబడులు పెట్టడం స్టార్ట్​చేశాడు. తర్వాత దివ్యాంశి అగర్వాల్​అశోక్‌‌‌‌‌‌‌‌రెడ్డి అనే మరో వ్యక్తిని వాట్సప్‌‌‌‌‌‌‌‌ ద్వారా పరిచయం చేసింది. అశోక్​సూచనతో రాజేశ్వరరావు ‘ట్రశూన్యన్‌‌‌‌‌‌‌‌’ అనే మరో యాప్​లో ఇన్వెస్ట్​చేయడం స్టార్ట్​చేశాడు. తర్వాత ఇన్వెస్ట్​మెంట్​లో భాగంగా అతని నుంచి విడతల వారీగా పలు కంపెనీల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి రూ.4.31 కోట్లు ట్రాన్స్​ఫర్​చేయించారు.

ఎలాంటి లాభాలు రాకపోగా, మరికొంత డిపాజిట్​చేయాలని దివ్యాంశి అగర్వాల్, అశోక్​రెడ్డి ఒత్తిడి చేయడంతో రాజేశ్వరరావు మోసపోయానని గుర్తించాడు.సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశాడు.