న్యూఢిల్లీ: ఓ కంపెనీకి సైబర్ మోసగాళ్లు రూ.35 లక్షల టోకరా పెట్టారు. కంపెనీ వాడుతున్న పేమెంట్ గేట్‌వేను హ్యాక్ చేసి డబ్బులు కాజేశారు. పర్విమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేమెంట్ గేట్‌వేగా క్యాష్‌ఫ్రీని వాడుతోంది. ఈ గేట్‌వే హ్యాక్‌కు గురికావడంతో సుమారు 35 గుర్తుతెలియని యూపీఐ ట్రాన్సాక్షన్లు తమ సిస్టమ్స్ నుంచి జరిగాయని పోలీస్ కంప్లెంట్‌లో పర్విమ్ టెక్నాలజీస్ ప్రతినిధి అంకిత్ రావత్ పేర్కొన్నారు.
మోసగాళ్లు సుమారు రూ.35 లక్షలను వివిధ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 420 కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశామని సంబంధిత పోలీసులు పేర్కొన్నారు.