బషీర్ బాగ్, వెలుగు: వర్క్ ఫ్రమ్ హోం పేరిట ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసగించారు. నగరానికి చెందిన 29 ఏళ్ల యువతి ప్రైవేటు జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోం పేరిట ఇన్‌స్టాలో రీల్స్చూసి సదరు నంబర్‌కు కాల్ చేసింది. దీంతో స్కామర్లు తొలుత ఆమెకు వాట్సాప్‌లో కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. వాటిని కంప్లీట్ చేయడంతో డబ్బులు చెల్లించారు.
తర్వాత టెలిగ్రామ్ యాప్‌లో తాము చూపించిన ప్రొడక్టులపై పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన యువతి రెండు పర్యాయాలుగా రూ.1.24 ఇన్వెస్ట్ చేసి మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైబ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.