బెదిరించారు.. రూ. 3 లక్షలు దోచేశారు..

బెదిరించారు.. రూ. 3 లక్షలు దోచేశారు..
  • డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి.. వృద్ధుడి నుంచి 3 లక్షలు దోపిడీ

  • ముంబై పోలీస్ పేరుతో సైబర్ నేరగాళ్ల వీడియో కాల్రూ

  • . 300 కోట్ల స్కాం చేశారని బెదిరింపులు అంటూ అమాయకులను బెదిరిస్తున్న

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. వీడియో కాల్ చేసి, డిజిటల్ అరెస్ట్ అంటూ అమాయకులను బెదిరిస్తున్నారు. పోలీస్ యూనిఫామ్స్ వేసుకోవడమే కాకుండా వారున్న ప్లేస్ పోలీస్ స్టేషన్, కోర్టు హాల్ తరహా సెట్టింగులతో కూడి ఉండటంతో చాలా మంది నిజమని నమ్మి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ అమీర్ పేట్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి (72) కూడా ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. అమీర్​పేట్​కు చెందిన సదరు వృద్ధుడికి ముంబై పోలీసుల పేరుతో వీడియో కాల్ చేశారు. కోట్లాది రూపాయల స్కామ్ లో అతడి పేరు బయటకు వచ్చిందని, తాము ఇంటరాగేషన్ చేస్తున్నామని బ్లాక్ మెయిల్ చేశారు. ‘‘మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం. వీడియో కాల్ నుంచి పక్కకు వెళ్లకూడదు. మేం చెప్పింది చెప్పినట్టు చేసి విచారణకు సహకరించాలి. లేకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపుతాం” అని భయపెట్టారు. బాధితుడి నుంచి రూ.3.30 లక్షలు వసూలు చేశారు. తర్వాత మోసపోయానని గుర్తించిన ఆ వృద్ధుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 రూ.300 కోట్ల స్కాంతో లింక్ ఉందని

బాధితుడికి +91 9395298271 నంబర్ ద్వారా వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌ వచ్చింది. అతడి మొబైల్ నంబర్‌‌‌‌తో ఫైనాన్సియల్ సైబర్ స్కామ్‌‌‌‌ జరిగినట్లు అందులో పేర్కొన్నారు. తర్వాత పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వీడియో కాల్‌‌‌‌ చేశాడు. నరేశ్ గోయల్‌‌‌‌ అనే వ్యక్తి రూ.300 కోట్లు స్కామ్‌‌‌‌ చేసినట్లు చెప్పాడు. ముంబైలోని తమ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని చెప్పాడు.

ఏడేండ్ల జైలు శిక్ష అని బెదిరించి..    

ఈ కేసులో పెనాల్టీ కింద ఆర్‌‌‌‌‌‌‌‌బీఐకి రూ.5 లక్షలు చెల్లించాలని.. లేకపోతే 7 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వీడియో కాల్ లో వృద్ధుడిని బెదిరించారు. అతడి ఆర్థికలావాదేవీలు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌ ద్వారా డబ్బు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయాలని ఒత్తిడి చేశారు. కంటిన్యూగా వీడియో కాల్‌‌‌‌లోనే ఉంచారు. అరెస్ట్ తప్పదని భయపెడుతూ రూ.3.30 లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత కాల్‌‌‌‌ కట్‌‌‌‌ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు భయాందోళనకు గురైన బాధితుడు తేరుకుని, తనకు తెలిసిన వారితో విషయం చెప్పాడు. సైబర్ నేరగాళ్లు కాల్‌‌‌‌ చేసినట్లు గుర్తించాడు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.