హైదరాబాద్, వెలుగు: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ సహా అకామిడేషన్, ట్రావెలింగ్ పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భక్తులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో నకిలీ వెబ్‌సైట్స్, లింక్‌లను సృష్టించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్,తగ్గింపు ధరలతో అట్రాక్ట్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్ బుకింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రకటనలు, లింక్స్ నమ్మి మోసపోవద్దన్నారు. రిజర్వేషన్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
యూపీ అధికారిక వెబ్‌సైట్స్‌లో మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. అకామిడేషన్ కోసం https://kumbh.gov.in/en/Wheretostaylist ను సంప్రదించాలి
గుర్తు తెలియని బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అడ్వాన్స్ చెల్లింపులు చేయవద్దు. వ్యక్తిగత సమాచారం,ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే జాగ్రత్తగా ఉండండి.
సైబర్ నేరగాళ్లుగా అనుమానం వస్తే అలాంటి కమ్యూనికేషన్ డిస్ కనెక్ట్ చేయాలి.
మోసపోయిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం, www.cybercrime.gov.in సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి
మహాకుంభ పేరుతో వచ్చే గుర్తు తెలియని లింక్‌లు, అకామిడేషన్ లింక్స్ క్లిక్ చేయకూడదు