బషీర్ బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కేటీఆర్ సేన రంగారెడ్డి’ అనే వాట్సాప్ గ్రూపులో సీఎం మార్ఫింగ్ఫొటోలను పెద్దపల్లి జిల్లా పెరుకపల్లికి చెందిన గడం అనిల్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా కొండూర్గ్కు చెందిన కాసామోని రమేశ్ సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి సీఎంను అవమానించేలా ఉండడంతో వారిద్దరిని శనివారం అరెస్ట్ చేసి, రిమాండ్కుతరలించారు.