స్టాక్​ మార్కెట్​ పేరుతో రూ.5.2 కోట్ల మోసం సైబర్​ నేరగాడు అరెస్ట్​ 

స్టాక్​ మార్కెట్​ పేరుతో రూ.5.2 కోట్ల మోసం సైబర్​ నేరగాడు అరెస్ట్​ 

హైదరాబాద్‌,వెలుగు: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.5.27 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాన్ని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైదుల్‌ ఇస్లామ్‌ ఖాన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడికి ‘ఏ117 ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యురిటీస్‌ అఫీషియల్‌ స్టాక్‌ కమ్యూనిటీ’ ఫేస్‌బుక్ లింక్‌ వచ్చింది. 

ఆ తరువాత వాట్సాప్‌ గ్రూప్‌లో యువకుడు చేరాడు. ఆ గ్రూప్‌ సీఈఓ అంకుర్‌ కేడియాగా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ఇలా రెండు విడతలుగా రూ.5.27 కోట్లు వసూలు చేశాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు టీజీ సీఎస్‌బీని ఆశ్రయించాడు. కేసును దర్యాప్తు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా సైబర్ నేరగాన్ని గుర్తించారు. వెస్ట్‌బెంగాల్‌లోని పుర్బ మెదినీపూర్‌‌ గ్రామానికి చెందిన సైదుల్‌ ఇస్లామ్‌ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.

జాబ్ పేరుతో..

బషీర్ బాగ్, వెలుగు : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ , ఓ యువకుడి నుంచి సైబర్​ నేరగాళ్లు డబ్బులను కొల్లగొట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి , పెద్ద కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని నమ్మించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు అంటూ మరో ఇద్దరి ఫోన్ నెంబర్లను బాధితుడికి పంపించారు. వారిని ఫోన్ లో సంప్రదించగా , జాబ్ ప్రాసెస్ చేయాలంటే... కొంత డబ్బు చెల్లించాలని వారి అకౌంట్ వివరాలను పంపించారు. అడ్వాన్స్ గా మొదట రూ. 47 వేలు పంపాడు. దీంతో సైబర్ చీటర్స్ అతడికి ఓ ఫేక్​ జాబ్ ఆఫర్ లెటర్ ను పంపించారు. మిగిలిన రూ. 3 లక్షల 19 వేలు పంపిస్తే జాబ్ తనకే వస్తుందని నమ్మించారు. దీంతో బాధితుడు వారి అకౌంట్ కు ఆ డబ్బును పంపాడు. డబ్బులు వారి అకౌంట్ కు వెళ్లగానే... మొదట పంపిన ఆఫర్ లెటర్ ను క్యాన్సల్ చేసి , మరొక ఫేక్​ ఆఫర్ లెటర్ ను పంపించారు. అనంతరం జాబ్ అంశంపై బాధితుడు వారికి కాల్స్ చేయగా బ్లాక్ లో పెట్టారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు మ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి 
వెల్లడించారు.