
- లేడీ టీచర్ను చీట్ చేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్ బాగ్, వెలుగు : పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసిన లేడీ టీచర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5.50లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ కు చెందిన టీచర్(57) ఇటీవల గూగుల్లో పర్సనల్ లోన్ కోసం సెర్చ్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు మహేశ్ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి.. పర్సనల్లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. రూ.15 లక్షల వరకు లోన్వచ్చే అవకాశం ఉందని తెలిపాడు.
ప్రాసెస్ చేయడానికి మొదట రూ.2 వేలు తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత లోన్ అప్రూవ్ అయిందని, డబ్బు క్రెడిట్అవ్వాలంటే కొంత డిపాజిట్చేయాలంటూ పలుమార్లు రూ.5,50,314 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తర్వాత మరికొంత కట్టాలని అడగడంతో మోసపోయానని తెలుసుకుని బాధిత టీచర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.