రిటైర్డ్ ‌‌ ‌‌ ఎంప్లాయ్ ‌‌కి సైబర్​గాళ్ల టోకరా

 రిటైర్డ్ ‌‌ ‌‌ ఎంప్లాయ్  ‌‌కి సైబర్​గాళ్ల టోకరా
  • ఇరాన్​కు డ్రగ్స్ పార్సిల్  ‌‌ ‌‌ చేస్తున్నావంటూ రూ.24 లక్షలు వసూలు 
  • సైబర్ క్రైమ్  ‌‌ ‌‌పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

హైదరాబాద్  ‌‌ ‌‌, వెలుగు: ఇరాన్  ‌‌ ‌‌కు డ్రగ్స్ పార్సిల్ చేస్తున్నారని బెదిరించి ఓ రిటైర్డ్  ‌‌ ‌‌ ఉద్యోగి(62) నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు. డయాబెటిక్  ‌‌ ‌‌ డ్రగ్  ‌‌ ‌‌, ఎమ్  ‌‌ ‌‌డీఎమ్  ‌‌ ‌‌ఏ ఇరాన్  ‌‌ ‌‌లోని ఓ డాక్టర్  ‌‌ ‌‌  ‌‌ ‌‌కు పంపిస్తున్నారని బెదిరించి రూ.24.58 లక్షలు వసూలు చేశారు. ఆన్  ‌‌ ‌‌లైన్ ఇంటరాగేషన్  ‌‌ ‌‌ పేరుతో ఆరు గంటల పాటు భయాందోళనకు గురిచేశారు. బాధితుడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్  ‌‌ ‌‌కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయ్  ‌‌ ‌‌కి శుక్రవారం ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్  ‌‌ ‌‌ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్  ‌‌ ‌‌, 100 గ్రాముల ఎండీఎం ‌‌ ‌‌ఏను ఫెడెక్స్ కొరియర్ ద్వారా ఇరాన్​ ‌‌ ‌‌లోని డాక్టర్ అర్మాన్ అలీకి డిస్పాచ్  ‌‌ ‌‌ వచ్చినట్లు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. కొరియర్​పై బాధితుడి ఫోన్  ‌‌ ‌‌ నంబర్  ‌‌ ‌‌  ‌‌ ‌‌, హైదరాబాద్  ‌‌ ‌‌అడ్రస్ ఉందని తెలిపాడు. తాను ఎలాంటి ప్యాకేజీని పంపలేదని, ఆ డాక్టర్ ఎవరో తనకు తెలియదని బాధితుడు స్పష్టం చేశాడు.

 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్  ‌‌ ‌‌సీబీ)కి కొరియర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌ విషయం తెలియజేశామని, ఎఫ్  ‌‌ ‌‌ఐఆర్ నంబర్ కూడా రిజిస్టర్ అయ్యిందని చెప్పారు. ఈ క్రమంలో ఎన్  ‌‌ ‌‌సీబీ అధికారులకు కనెక్ట్ చేస్తున్నామంటూ వాట్సాప్ వీడియో కాల్  ‌‌ ‌‌ చేశారు. వారి మాటలు నమ్మని బాధితుడు ఐడీ కార్డులు చూపించాలని డిమాండ్  ‌‌ ‌‌ చేశాడు. దీంతో సైబర్ ‌‌ ‌‌  ‌‌ ‌‌గాళ్లు కొన్ని ఫేక్​ ఐడీ కార్డులను షేర్ ‌‌ ‌‌  ‌‌ ‌‌చేశారు. వాటిని పరిశీలించే లోపే డిలీట్  ‌‌ ‌‌ చేశారు. 

తర్వాత ఆరు గంటలకు పైగా వీడియో కాల్​ ‌‌ ‌‌లో విచారించారు. ఈ క్రమంలో బాధితుడి సేవింగ్  ‌‌ ‌‌ అకౌంట్స్  ‌‌ ‌‌, ఫిక్స్  ‌‌ ‌‌డ్  ‌‌ ‌‌ డిపాజిట్లు (ఎఫ్  ‌‌ ‌‌డీ) వివరాలు చెప్పాలని ఒత్తిడి చేశారు. వివిధ బ్యాంక్ అకౌంట్స్  ‌‌ ‌‌లో ఉన్న బ్యాలెన్స్  ‌‌ ‌‌, ఎఫ్  ‌‌ ‌‌డీల గురించి తెలుసుకున్నారు. రూ.24.58 లక్షలు తామిచ్చిన అకౌంట్​కి ట్రాన్స్  ‌‌ ‌‌ఫర్ చేయాలని, ఆ అకౌంట్స్ ‌‌ ను పరిశీలించాక 10 నిమిషాల్లో తిరిగి డిపాజిట్  ‌‌ ‌‌అవుతుందని నమ్మించారు. దీంతో బాధితుడు తన డబ్బును వారి అకౌంట్  ‌‌ ‌‌కు ట్రాన్స్  ‌‌ ‌‌ఫర్ చేశాడు. 10 నిమిషాల తర్వాత డబ్బు క్రెడిట్  ‌‌ ‌‌కాకపోవడంతో మోసపోయానని గుర్తించి శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.