ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చిందని.. రూ.91.64 లక్షలు కొట్టేశారు

ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చిందని.. రూ.91.64 లక్షలు కొట్టేశారు
  • సిటీకి చెందిన వృద్ధుడిని మోసగించిన సైబర్ క్రిమినల్స్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌ కొరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రగ్స్ వచ్చాయని ఓ వృద్ధుడిని సైబర్ క్రిమినల్స్ బ్లాక్ మెయిల్‌‌‌‌‌‌‌‌ చేసి రూ. లక్షల్లో కొట్టేశారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ప్రకారం..  సీబీఐ, ముంబయి సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులమంటూ..ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌ కొరియర్ పేరుతో వారం కిందట సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ వృద్ధుడి(74)కి కాల్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అతని ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ అడ్రస్‌‌‌‌‌‌‌‌తో బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ నుంచి పార్సిల్ వచ్చినట్లు చెప్పారు.

అందులో 140 గ్రాముల ఎండీఎంఏ,4 కిలోల క్లాత్స్, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌, ఐదు పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయని, దీనికి సంబంధించి ముంబయి సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైందని తెలిపారు. ఆ తర్వాత మరోసారి స్కైప్‌‌‌‌‌‌‌‌లో వీడియా కాల్‌‌‌‌‌‌‌‌ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశామని వృద్ధుడిని బెదిరించి అతని నుంచి రూ.91.64 లక్షలు తమ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లోకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయించుకుని, రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్‌‌‌‌‌‌‌‌ చేయగా కేసు నమోదు చేశారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి మోసం జరిగినా 1930కి కాల్‌‌‌‌‌‌‌‌ చేయాలని లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు.