సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ వెబ్ సైట్లతో లాభాల ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆన్ లైన్ స్టాక్ పెట్టబడుల మోసాలు బాగా పెరిగిపోయాయి. దేశంలో నెలల వ్యవధిలోనే వందల మంది ఈ స్కామ్ ల బారిన పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణలో ఈ ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఆన్ లైన్ పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి కోటి రూపాయలు కాజేసింది ఓ మహిళ.. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని APR గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివాసముండే బెజవాడ నాగార్జున్ (36) ఆన్ లైన్ లో ఓ మహిళ చేతికి చిక్కి రూ. కోటి పోగొట్టుకున్నాడు. వాట్పాప్ ద్వారా పరిచయమైన నాడియా కామి అనే మహిళ ... స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయమని నాగార్జునను ప్రోత్సహించింది. మంచి లాభాలు ఉంటాయని ఆశచూపింది. ఆ మహిళ వాట్సాప్ ద్వారా పంపిన నకిలీ స్టాక్ మార్కెట్ మేసేజ్ లింక్ ద్వారా పెట్టుబడి పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసింది.
Also Read:-బ్యాటరీ పేలి.. కాలిపోయిన ఎలక్ట్రిక్ బైక్
దీంతో నాగార్జున దఫాలవారీగా 99 లక్షల 78వేల 526 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి అసలు, కమిషన్ అడగగా కాంటాక్ట్ కట్ చేసింది ఆ కిలాడీ లేడీ.. మోసపోయానని తెలుసుకున్న నాగార్జున్ 1930 నంబర్ కు కాల్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన పటాన్ చెరు పోలీసులు చాకచాక్యంగా రూ.24 లక్షల ఫ్రాడ్ స్ట్ అకౌంట్ లను ఫ్రీజ్ చేయించారు. సో..సైబర్ నేరగాళ్లు ఏరూపంలోనైనా అటాక్ చేయొచ్చు బీ అలర్ట్..