హర్షసాయి టీమ్​పేరుతో సైబర్​ మోసం

హర్షసాయి టీమ్​పేరుతో సైబర్​ మోసం

మిడ్జిల్: వెలుగు : హర్ష సాయి  టీం పేరుతో..  సహాయం చేస్తామని నమ్మించి రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  మండల కేంద్రానికి చెందిన బరిగెల ఆంజనేయులు తండ్రి జంగయ్య గత సంవత్సరం జరిగిన ఓ యాక్సిడెంటులో  తీవ్రంగా గాయపడ్డాడు. వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుతున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంజనేయులు..  హర్ష సాయి ఇన్​స్టా గ్రామ్​ ఐడీ లో  సాయం కావాలని కామెంట్ చేశాడు. .

ఇది గమనించిన దుండగులు హర్ష సాయి ఆఫీస్  నుంచి మాట్లాడుతున్నామని రూ. 4లక్షల సాయం చేస్తామని   సంప్రదించారు.  డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జెస్​ ఉంటాయని , అవి    ఫోన్ పే చేస్తే.. ఆ మరుక్షణమే   హర్ష సాయి టీం నుంచి సాయం అందుతుందని చెప్పారు.  నమ్మిన ఆంజనేయులు మంగళవారం సాయంత్రం వారిచ్చిన ఫోన్ నెంబర్​కు  22 వేలు  ఫోన్ పే ద్వారా పంపారు.  సహాయం కోసం ఆంజనేయులు మళ్ళీ ఫోన్ చేస్తే కేవలం 5500 ఫోన్ పే చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించిన ఆంజనేయులు పోలీసులను సంప్రదించాడు.