పీఎం కేర్ పేరుతో ఫేక్ అకౌంట్
కరోనా విరాళాలను టార్గెట్ చేసిన సైబర్ దొంగలు
ఒక్క అక్షరం తీసేసి నకిలీ యూపీఐ ఐడీ పెట్టిన్రు
హైదరాబాద్,వెలుగు: కరోనా రిలీఫ్ ఫండ్ ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. కరోనా బాధితుల వైద్య, నిత్యావసరాల కోసం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న విరాళాలను కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ కోసం కేంద్ర ప్రభుత్వం pmcares@sbi పేరుతో అకౌంట్ ఓపెన్ చేసింది. భీమ్ యూపీఐ ఐడీతో లింక్ చేసిన అకౌంట్ తో కరోనా వైరస్ నివారణ కోసం ప్రభ్వుత్వం విరాళాలను సేకరిస్తోంది. విరాళాలు అందించాల్సిన దాతలకు మొబైల్ యూపీఐ ఐడీలను అందుబాటులో ఉంచింది. దీంతో రిలీఫ్ ఫండ్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. కేవలం ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి pmcare@sbi పేరుతో నకిలీ యూపీఐ ఐడీని క్రియేట్ చేశారు. దేశవ్యాప్తంగా పీఎం సహాయ నిధికి అందే విరాళాలను ఫేక్ అకౌంట్స్ తో దోచుకునే ప్రయత్నం చేశారు. సైబర్ దొంగలు క్రియేట్ చేసిన నకిలీ అకౌంట్ ను బ్యాంక్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఫేక్ అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేశారు.
For More News..