గచ్చిబౌలిలో 75 శాతం హాస్టళ్లలో ఫైర్ ​సేఫ్టీ లేదు

గచ్చిబౌలిలో 75 శాతం హాస్టళ్లలో ఫైర్ ​సేఫ్టీ లేదు
  • చాలా వరకు అక్రమ నిర్మాణాల్లోనే కొనసాగుతున్నయ్
  • పోలీసులు, హైడ్రా అధికారుల పరిశీలనలో వెల్లడి  ​
  •  సైబరాబాద్​ సీపీ ఆఫీసులో హాస్టల్ మేనేజ్​మెంట్లతో సమన్వయ సమావేశం

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ పరిధిలోని 75 శాతం హాస్టళ్లలో ఫైర్​సేఫ్టీ లేదని సైబరాబాద్​సీపీ అవినాష్​మహంతి తెలిపారు. చాలావరకు అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. సైబరాబాద్ సీపీ ఆఫీసులో బుధవారం మాదాపూర్, బాలానగర్​జోన్ల పరిధిలోని హాస్టళ్ల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీపీ అవినాష్​ మహంతి, జాయింట్​సీపీ గజారావు భూపాల్​పాల్గొని మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, ఫైర్​సేఫ్టీపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో మొత్తం 4 వేల హాస్టళ్లు ఉన్నాయని, ప్రతిఒక్కరూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, భద్రతపై తగిచ చర్యలు తీసుకోవాలని సూచించారు. 

హాస్టళ్లలో ఉండే వారి వివరాలను రికార్డుల్లో పొందుపరచాలని తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జాయింట్​సీపీ గజారావు భూపాల్​ మాట్లాడుతూ.. హాస్టళ్లలో పార్కింగ్​సదుపాయం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ నంబర్లను డిస్​ప్లే చేయాలన్నారు. హైడ్రా అదనపు డైరెక్టర్(ఫైర్) మాట్లాడుతూ.. హాస్టళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా ఫైర్​ఎన్ఓసీ తీసుకోవాలన్నారు. 75 శాతం హాస్టళ్లలో ఫైర్​సేఫ్టీ లేదని చెప్పారు. డీసీపీలు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు, హైడ్రా అధికారులు, హాస్టల్​ ప్రతినిధులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.