- సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి హెచ్చరిక
- ప్రైవేట్ బస్ట్రావెల్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం
గచ్చిబౌలి, వెలుగు: ప్రైవేట్ బస్ డ్రైవర్లు కచ్చితంగా ట్రాఫిక్రూల్స్పాటించాలని సైబరాబాద్సీపీ అవినాశ్మహంతి సూచించారు. పదే పదే రూల్స్ బ్రేక్చేసినా, యాక్సిడెంట్లకు కారణమైనా శాశ్వతంగా లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు సేఫ్టీ రూల్స్, బస్సుల్లో మహిళల సేఫ్టీ, డ్రగ్స్అక్రమ రవాణా అరికట్టడంపై గురువారం ఇంటర్ సిటీ, సిటీ ప్రైవేట్‌బస్సు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులతో సీపీ అవినాశ్మహంతి సమావేశమయ్యారు.
రాష్ట్ర రవాణా కమిషనర్ఇల్లంబర్తి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, టీజీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య పాల్గొన్నారు. బస్సుల ఓనర్లు తమ డ్రైవర్ల స్కిల్స్‌ను చెక్ చేయాలని, సర్వీస్‌పై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని సీపీ సూచించారు. కమిషనరేట్పరిధిలోకి ఇంటర్‌స్టేట్, ఇంటర్సిటీ బస్సులను ఉదయం 7.30 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతించబోమన్నారు.
సైబర్ టవర్స్, ఫోరం మాల్, దుర్గం చెరువుతోపాటు పలు ఫ్లైఓవర్లపై సరుకు రవాణా, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. రవాణా కమిషనర్ ఇల్లంబర్తి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమైందని, బస్సుల్లో ప్యానిక్బటన్లు, సీసీ కెమెరాలను, డాష్ కెమెరాలు అమర్చుకోవాలని చెప్పారు. అక్టోబర్1 నుంచి ఆటోమేటెడ్ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
బస్సుల్లో గ్యాస్ స్టవ్‌లు, వంట సామాగ్రిని నిషేధించాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ట్రావెల్ ఏజెన్సీల యజమానులు పాల్గొ న్నారు. అలాగే సీపీ అవినాశ్మహంతి, ట్రాఫిక్ జాయింట్సీపీ జోయల్ డేవిస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి గురువారం సైబర్టవర్స్నుంచి యశోద హాస్పిటల్ రూట్, ఎన్ఐఏ సర్వీస్ రోడ్డు, సిద్దివినాయక్నగర్రూట్ ను పరిశీలించారు. ట్రాఫిక్సమస్యను తగ్గించేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు.