ఎన్నికల నిబంధనలు అందరూ పాటించాలి: సీపీ స్టీఫెన్ రవీంద్ర

ఎన్నికల నిబంధనలు అందరూ పాటించాలి:  సీపీ స్టీఫెన్ రవీంద్ర

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మికంగా పర్యటించారు. త్వరలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని సిక్కు కమ్యూనిటీ నేతలను కలిశారు. వారితో ముఖాముఖీగా మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని వారికి సూచించారు. ఎన్నికల నిబంధనలను అందరూ పాటించాలని తెలిపారు. 

Also Read :- డీకే శివకుమార్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.