సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పితృ వియోగం.. డీజీపీ అంజనీకుమార్ సంతాపం

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తండ్రి, మాజీ పోలీస్ అధికారి రంజిత్ ఇవాళ (అక్టోబర్ 25) కన్నుమూశారు. మాజీ పోలీస్ ఆఫీసర్ రంజిత్ మృతిపట్ల తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి పోలీస్ వర్గాలకు తీరని లోటన్నారు డీజీపీ. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పోలీస్ అధికారిగా రంజిత్ నేతృత్వంలో పనిచేసిన అనుభవం ఉందని... పోలీస్ శాఖకు ఆయన సేవలు మరువలేనివన్నారు డీజీపీ. గుంటూరులో ఎస్పీగా పనిచేస్తు న్నప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు డీజీపీ అంజనీకుమార్.