రూ.2 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్ కాల్చివేత

రూ.2 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్ కాల్చివేత
  • 872 కేజీల మాదకద్రవ్యాల దహనం 

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీసులు, టీజీ న్యాబ్ అధికారులు కలిసి పట్టుకున్న 872 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ ని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆఫీసర్లు శుక్రవారం ధ్వంసం చేశారు. దగ్ధం చేసిన డ్రగ్స్ విలువ దాదాపుగా రూ. 2.25 కోట్లు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఎదులపల్లి గ్రామంలో ఉన్న జీజే మల్టీకేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ) లో డ్రగ్స్ ను కాల్చివేశారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్, రాజేంద్రనగర్, బాలానగర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లలోని 12 పోలీస్ స్టేషన్లలో ఈ డ్రగ్స్ పై 37కేసులు నమోదయ్యాయి. అధికారులు కాల్చివేసిన నార్కోటిక్ డ్రగ్స్ లో 845 కేజీల గంజాయి, 61 గ్రాముల 3 గంజాయి మొక్కలు, 26 కేజీల గంజాయి చాక్లెట్లు, 7.5 ఎంఎల్ హాష్ ఆయిల్, 9.16 గ్రాముల ఎండీఎంఏ, 502 గ్రాముల ఆల్ఫ్రాజోలం ఉన్నాయి.