- ప్లాట్స్‌పై పెట్టుబడి పెడితే భారీగా రిటర్న్స్ ఇస్తామంటూ ప్రచారం
- 9 మంది నుంచి రూ. 3.1 కోట్లు వసూలు, భార్యాభర్తలు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : ఓపెన్ ప్లాట్స్‌పై పెట్టుబడులు పెడితే బై బ్యాక్ స్కీం కింద పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని మోసం చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌కి చెందిన మగులూరి చంద్రారెడ్డి, అరుణ భార్యాభర్తలు. వీరిద్దరూ కలిసి మాదాపూర్‌లో గాయత్రీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించారు. తమ వెంచర్‌లోని ఓపెన్ ప్లాట్స్‌పై పెట్టుబడులు పెడితే బై బ్యాక్ స్కీమ్ కింద పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తామని ప్రచారం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని వెంచర్‌లో ఓపెన్ ప్లాట్స్‌ని చూపించారు.
దీంతో పెట్టుబడి పెట్టేందుకు నిజాంపేటకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ముందుకు వచ్చారు. దీంతో రూ. 1.15 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 15 నెలల తర్వాత డెవలప్ చేసిన 1,600 గజాల స్థలం గానీ, రూ. 1.60 కోట్లుగానీ చెల్లిస్తామని చంద్రారెడ్డి చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి రూ. 1.15 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఇందుకుగానూ చంద్రారెడ్డి సేల్ డీడ్, ఎంవోయూ, పోస్ట్ డేటెడ్ చెక్కులను అందజేశాడు. అయితే చంద్రారెడ్డి చూపెట్టిన ల్యాండ్ విలువ రూ. 40 లక్షలకు మించి లేకపోవడంతో మోసం చేసినట్లు గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం చంద్రారెడ్డి, అరుణను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇదే తరహాలో మరో 9 మంది నుంచి రూ. 3.1 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.