పోలీస్​ పెట్రోలింగ్ కార్లకు కెమెరాలు

పోలీస్​ పెట్రోలింగ్ కార్లకు కెమెరాలు

కూకట్​పల్లి, వెలుగు: నేరాల నియంత్రణ, కేసు విచారణల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాలను సైబరాబాద్​పోలీసులు తమ పెట్రోలింగ్​ వెహికల్స్​కు బిగించుకోవాలని చూస్తున్నారు. కమిషనర్​ అవినాష్ ​మహంతి బాలానగర్​ పీఎస్​ పరిధిలోని పెట్రోలింగ్​ వెహికల్స్​కు ప్రయోగాత్మకంగా  ఫిట్​ చేయించి పరిశీలించారు. 

ఏసీపీ హనుమంతరావు వాహనాలను ప్రారంభించారు. పెట్రోలింగ్​టైంలో రికార్డ్​అయ్యే వీడియో ఫుటేజీలను కమిషనరేట్​నుంచి పర్యవేక్షిస్తారని తెలిపారు.