డెలివరీ బాయ్ గా  డ్రగ్స్ సప్లయ్ .. యువకుడిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

డెలివరీ బాయ్ గా  డ్రగ్స్ సప్లయ్ .. యువకుడిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: డెలివరీ బాయ్​గా  డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని సైబరాబాద్​పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద 15 గ్రాముల ఎండీఎంఏ, 22.500 కిలోల గంజాయి, 71 నిట్రోసన్ ట్యాబ్లెట్లు, 491 గ్రాముల హ్యాష్​ ఆయిల్​స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.  మంగళవారం సైబరాబాద్​ కమిషనరేట్​లో  మీడియా సమావేశంలో మాదాపూర్​ జోన్​డీసీపీ వినీత్​వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన షేక్​బిలాల్​(28) ఇంటర్​నుంచే  గంజాయికి బానిసగా మారాడు. సిటీకి వచ్చి మాదాపూర్​ఇజ్జత్​నగర్​లో రూమ్ తీసుకొని ఉంటూ జొమాటో డెలివరీ బాయ్​గా జాయిన్​అయ్యాడు.

స్థానికంగా గంజాయి అమ్మడం మొదలుపెట్టాడు. రాజమండ్రికి చెందిన భానుతేజ వద్ద ఎండీఎంఏను కొనుగోలు చేసి తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు.  సోషల్​మీడియా ద్వారా 40 నుంచి 45 మంది ఐటీ ఎంప్లాయీస్ కు గంజాయి, ఎండీఎంఏ డ్రగ్స్​సప్లై చేశాడు.  మంగళవారం తన రూమ్ లో దాచిన 15 గ్రాముల ఎండీఎంఏ, 22.500 కేజీల గంజాయి, 71 నిట్రోసన్​ ట్యాబ్లెట్లు, 491 గ్రాముల హ్యాష్​ ఆయిల్​ను టీజీ న్యాబ్​అధికారులతో కలిసి మాదాపూర్​పోలీసులు రైడ్​చేసి పట్టుకున్నారు. షేక్​బిలాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  భానుతేజ ప్రస్తుతం జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ​టీజీన్యాబ్​ ఎస్పీ సీతారాం, డీఎస్పీ నర్సింగరావు, మాదాపూర్​ ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్​, టీజీ న్యాబ్​ఇన్​స్పెక్టర్​రాజశేఖర్​, మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​ కృష్ణమోహన్​పాల్గొన్నారు.