- మావోయిస్టు దీపక్ రావు అరెస్టు
- హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు : మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ సంజయ్ దీపక్‌రావు (62)ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి మలేషియన్ టౌన్‌షిప్‌లో గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి పిస్టల్, బుల్లెట్లు, ల్యాప్‌టాప్, రూ.42 వేలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన సంజయ్ దీపక్ రావు 1999లో సీపీఐ(ఎంఎల్) సీఆర్‌సీ, రావూఫ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు. మహారాష్ట్ర ఇన్ చార్జ్‌గా పని చేశాడు. 2021 నవంబర్‌లో వెస్ట్రన్ ఘాట్స్ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు. దీపక్ రావు తరచూ హైదరాబాద్, ముంబై, పుణెలోని ఫ్రెండ్స్‌ను కలుస్తుండేవాడు. ఈ ఏడాది జనవరి నుంచి సంజయ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) ఆయన కదలికలపై నిఘా పెట్టింది. స్థానిక పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకుంది.
ALSO READ: 9 కొత్త మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర వాటా నయా పైసా లేదు : ఎంపీ అర్వింద్
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేదు: డీజీపీ
రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయిందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. బార్డర్స్‌లో కొంత ప్రభావం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో రానున్న ఎలక్షన్స్‌లో మావోయిస్టుల ప్రభావం ఉండదన్నారు. సంజయ్ అరెస్టుతో మావోయిస్టులకు సంబంధించిన కీలక వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.