హైదరాబాద్, వెలుగు : గత మూడేండ్లలో వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్న గంజాయి, వివిధ రకాల డ్రగ్స్ ను సైబరాబాద్ పోలీసులు తగలబెట్టారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఎదులపల్లిలోని జీజే మల్టీక్లేవ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లో డిస్పోజ్ చేశారు. గడిచిన మూడేండ్లలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మొత్తం 122 కేసులు నమోదు కాగా, పోలీసులు 5,007 కిలోల గంజాయి, 38 గ్రాముల గంజాయి మొక్కలు, 2,647 గ్రాముల హాష్ ఆయిల్
45 గ్రాముల కొకైన్, 46 గ్రాములు హెరాయిన్, 222.72 గ్రాముల ఓపీఎం, 6.6 గ్రాముల చరాస్, 12.3 గ్రాముల మెఫెడ్రోన్,168 ఎక్సటసీ ట్యాబ్లెట్స్, 0.54 గ్రాముల ఎక్సటసీ పౌడర్, 44 ఎల్‌ఎస్‌డీ పేపర్స్,1.46 మెథపెటమైన్ సహా 15 రకాల డ్రగ్స్ ను సీజ్చేశారు. వీటన్నింటిని శుక్రవారం కాల్చి బూడిద చేశారు.