గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో జరిగిన కాల్పుల ఘటనతో సైబరాబాద్పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. మాదాపూర్జోన్పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జిలు, వినోద సంస్థలు, ఈవెంట్ మేనేజర్లు, ప్రైవేట్‌సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులతో డీసీపీ డా. వినీత్ గురువారంసమావేశమయ్యారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్కమిషనరేట్ఆఫీస్లో మీటింగ్ నిర్వహించి భద్రత ఏర్పాట్లు, మేనేజ్మెంట్ల పాత్రపై చర్చించారు.
శాంతిభద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులకు సహకరించాలని డీసీపీ సూచించారు. ప్రైవేటు భద్రతా ఏజెన్సీలు కచ్చితంగా 2005 పీఎస్ఏఆర్ఏ యాక్ట్ రూల్స్‌ను పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసు, సైనిక, పారామిలిటరీ దశాల యూనిఫాంను సెక్యూరిటీ సిబ్బంది ధరించవద్దన్నారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లను సమయానికి క్లోజ్ చేయాలన్నారు. డ్రగ్స్, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మాదాపూర్జోన్ ఏడీసీపీ, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు.